కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

● ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి ● బీఆర్‌ఎస్‌ నేతలకు మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపు

పరిగి: హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. బీఎల్‌ఏలు సర్‌ ప్రక్రియలో పాల్గొని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను విస్మరించి ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీనీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచనే లేదని మండి పడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement