అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

మోమిన్‌పేట: విత్తనాలు, ఎరువులను అదిక ధరలకు విక్రయిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని తహసీల్దార్‌ రవీందర్‌ హెచ్చరించారు. మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ బృందం మండల కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్‌, విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు తప్పక ఇవ్వాలని సూచించారు. బీజీ–3 త్తనాలను అమ్మిన, స్టాకు ఉన్నా పీడీ యాక్టు ఉంటుందన్నారు. ఎరువులు, వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను స్టాకు బోర్డుపై ఉదయాన్నే ప్రదర్శించాలని చెప్పారు. నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ తదితరులు ఉన్నారు.

తహసీల్దార్‌ రవీందర్‌

Advertisement
 
Advertisement
Advertisement