నేను చనిపోతున్నా.. బతకాలని లేదు | - | Sakshi
Sakshi News home page

నేను చనిపోతున్నా.. బతకాలని లేదు

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య

పహాడీషరీఫ్‌: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ వ్యక్తి భార్యకు వీడియో కాల్‌ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంనాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్‌(37) జీహెచ్‌ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్‌కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్‌ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్‌ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్‌ కట్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్‌ మేనమామ రవీందర్‌కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement