జొన్నలకు రూ.3,699 మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

జొన్నలకు రూ.3,699 మద్దతు ధర

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

అనంతగిరి: జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతుతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో మార్క్‌ఫెడ్‌–డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీనివాస్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రూ.3,699 మద్దతు ధర పొంది అధిక లాభం గడించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మల్లేఽశం, డైరక్టర్లు రమేశ్‌నాయక్‌, పాపిరెడ్డి, పాండురంగారెడ్డి, ప్రభాకర్‌, విజేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ మేనేజర్‌ సుదర్శన్‌రెడ్డి, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement