బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌

తాండూరు టౌన్‌: అతివేగం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది, సీఐ పరమేశ్వర్‌ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకిషన్‌రావు(45) వికాట్‌ సాగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉద్యోగి. మధ్యాహ్నం ఆయన తన బైక్‌పై బాబుతో కలిసి గౌతాపూర్‌ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో గౌతాపూర్‌ నుంచి తాండూరుకు నాపరాతి లోడ్‌ ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన రాధాకిషన్‌ రావు కాళ్ల మీదుగా ట్రాక్టర్‌ ప్రయాణించగా తీవ్రంగా గాయపడ్డారు. బాబు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాధాకిషన్‌ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఆయన్ను నగరానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య మనోజ్ఞ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ నాగరాజు పరారీలో ఉన్నాడు.

ద్విచక్ర వాహనదారుడి మృతి

మరొకరికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement