అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడుతానని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ సమావేశం హాలులో చైర్‌పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు తమ వార్డుల పరిధిలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. వర్షాకాలంలో మున్సిపల్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాలు నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. అధికారులు, వార్డు అధికారులు కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య


