నిర్వాసితులకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు పరిహారం

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

నిర్వాసితులకు పరిహారం కాంగ్రెస్‌ గూటికి రుక్మాపూర్‌ సర్పంచ్‌ అక్రమ నిర్మాణం కూల్చివేత

58 మందికి రూ.1.37 కోట్లు

కొడంగల్‌: మహబూబ్‌నగర్‌–చించోలీ జాతీ య రహదారి విస్తరణకు పట్టణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు మంగళవారం పరిహారం చెక్కులు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 58 మంది లబ్ధిదారులకు రూ.1,37,55,105 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, తహసీల్దార్‌ రాంబాబు, కమిషనర్‌ బలరాం నాయక్‌, వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, రమేశ్‌బాబు, సోమశేఖర్‌, దాము పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌ సర్పంచ్‌ బాల్‌రాజ్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం ఆయనకు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ నాయకులు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, సర్పంచ్‌ సుమిత్రభాయ్‌, సీనియర్‌ నాయకులు శోభారాణి, ఎల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో హద్దులు నిర్ణయించి,

ఫెన్సింగ్‌ వేసేందుకు నిర్ణయం

పహాడీషరీఫ్‌: బాలాపూర్‌ మండల పరిధిలోని జల్‌పల్లి గ్రామ బిజాన్‌గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయమై సాక్షి దినపత్రికలో ‘బిజాన్‌గుట్టపై అక్రమార్కుల కన్ను’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాలాపూర్‌ తహసీల్దార్‌ ఇందిరాదేవి ఆదేశానుసారం ఆర్‌ఐలు జమీల్‌, సుధాకర్‌లు జీపీవోలతో కలిసి ఉదయమే బిజాన్‌గుట్టకు చేరుకున్నారు. అధికారుల రాక విషయం తెలుసుకున్న వ్యక్తులు ప్రొక్లెయినర్‌ను అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్‌ వాల్‌ ప్రహరీని ఈ సందర్భంగా కూల్చివేశారు. త్వరలోనే స్థలానికి హద్దులు నిర్ణయించి, కబ్జా బారిన పడకుండా శాశ్వత పెన్సింగ్‌ నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లయితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

వెల్జర్లలో విషాదఛాయలు

షాద్‌నగర్‌: బిడ్డ బంగారు భవిష్యత్తును ఆశించిన తల్లిదండ్రుల ఆశ నెరవేర లేదు. బంగారు భవిష్య త్తు కోసం రెక్కలు ముక్క లు చేసుకొని కొడుకును చదివిస్తే అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో షాద్‌నగర్‌ పరిధిలోని వెల్జర్లకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలమణి, కృష్ణయ్యల కుమారుడు కార్తీక్‌ (26) పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం తోటి స్నేహితులు గుర్తించి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కృష్ణయ్య సోమ వారం ఉదయమే కొడుకును హాస్టల్‌లో విడిచిపెట్టివచ్చాడు. కార్తీక్‌కు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement