ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

శంకర్‌పల్లి: నిర్మాణ కంపెనీలో పని చేస్తు న్న ఓ యువకుడు ప్ర మాదవశాత్తు గుంత లో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం అనంతవరం గ్రామానికి చెందిన రాజు, రేణుక దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లి మండలం మోకిలకి వచ్చి నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. వీరి పెద్ద కొడుకు అశోక్‌(25) స్థానికంగా ఎస్‌ఎస్‌ఐ బహుళ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పని చేస్తుండగా బిల్డింగ్‌ పై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న కుంటలో పడ్డాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మురుగు కాలువలో

మృతదేహం లభ్యం

పహాడీషరీఫ్‌: మురుగు కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై దయాకర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ మురుగు కాలువలో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పేకాట స్థావరాలపై దాడులు

కొందుర్గు: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్‌లో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌ తెలిపారు. ఈ దాడుల్లో రూ.60,800 నగదు, ఏడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement