జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల మొక్కలు | - | Sakshi
Sakshi News home page

జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల మొక్కలు

Jun 10 2026 7:26 AM | Updated on Jun 10 2026 7:26 AM

పరిగి: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించుకోవాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జాఫర్‌పల్లిలోని ఎకో అర్బన్‌ పార్కులో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని ఎంచుకున్నామన్నారు. మొక్కలతోనే మానవ జీవన విధానం ముడిపడి ఉందన్నారు. జాఫర్‌పల్లిలో 120 ఎకరాల్లో ఎకో అర్బన్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్క్‌ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ, సర్పంచ్‌ మహేశ్‌కుమార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు లాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement