న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ
‘వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్‌కు చెందిన ఈ రైతు పేరు నాగప్ప. ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ తూకం వేయలేదు. ఉదయం ఆరబోయడం, సాయంత్రం కుప్పనూర్చడంతోనే సరిపోతోంది. మార్కెట్లో సరైన టార్పాలిన్లు కూడా లేవు. అకస్మాత్తుగా కురిసే వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.’
● బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు పరమేశ్వర్ రెడ్డి
● స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి
తాండూరు టౌన్/అనంతగిరి: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నెట్వర్స్ టవర్స్ మంజూరైనట్లు బీజేపీ రాష్ట మాజీ కార్యవర్గ సభ్యుడు, దిశా కమిటీ సభ్యుడు మిట్ట పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారిని కలిసి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి ప్రతం అందజేశారు. టెలికం అడ్వైజరీ మెంబర్స్ ఘనాపూర్ వెంకటయ్య, పెంటయ్య గుప్తా, పోకల సతీష్, గాజుల శాంత్‌కుమార్ అభ్యర్థన మేరకు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో ఆరు టవర్స్ మంజూరైనట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఒకటి, వికారాబాద్ నియోజకవర్గం మోమిన్‌పేట్ మండలంలోని దుర్గం చెరువు, సయ్యదలీపూర్‌లో రెండు, తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని క్యాద్గిరాలో, పెద్దేముల్ మండలంలోని మారేపల్లిలో రెండు, పరిగి నియోజకవర్గం కు ల్కచర్ల మండలంలోని మక్త వెంకటాపూర్‌లో ఒక టవర్ మంజూరైనట్లు తెలిపారు. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
అనంతగిరి: చెట్లతోనే మానవ మనుగడని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నా రు. చెట్లను పెంచితే భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, అడిష నల్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్, ఎస్పీ స్నేహ మెహ్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లవకుమార్, ఉపాధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంకు మార్, ప్రతిమ, విజయ్‌కుమార్, నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు, ఫారెస్టు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుద్యాల్: మండలానికి మంజూరైన ఐదు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలుముల్ మైల్వార్, బాలికల పాఠశాల హకీంపేట్, దుద్యాల్, కుదురుమల్ల, పోలేపల్లికి పాఠశాలలు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ మీడియట్ పాస్‌తో పాటు డీఎడ్ (టీటీసీ) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
బషీరాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, బాలికలకు ఒకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్ అడ్మిషన్లలో పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకరప్ప ప్రిన్సిపాల్‌ను కోరారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన ఈ రైతు పేరు మత్తరకంటి ముత్తయ్య. మార్కెట్‌కు ధాన్యం తెచ్చి నెలరోజులైంది. ఎనిమిది క్వింటాళ్లకుపైగా ఉంటుంది. బస్తాలు ఇచ్చారు కానీ ఎత్తలేదు. నిత్యం ఆరబోయడం, కుప్పనూర్చడంతోనే సరిపోతోంది. యాసంగి ధాన్యం వానాకాలం ప్రారంభం వరకు కూడా కొనకపోతే ఎట్లా అని, పంట పెట్టుబడికి మళ్లీ ఎక్కడ తేవాలని వాపోయాడు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మరో రెండు రోజుల్లో రోహిణి కార్తె ముగిసి మృగశిరకార్తే ప్రారంభం కాబోతోంది. పంటలకు ఈ కార్తెను శుభసూచకంగా రైతులు భావిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక మంది దుక్కులు దున్ని విత్తు నాటేందుకు సిద్ధమవుతుంటే.. మరికొంత మంది యాసంగిలో పండించిన పంట ఇప్పటికీ అమ్ముడుపోక అరిగోసపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర, సన్నాలకు బోనస్‌ల సంగతేమో గానీ కొనుగోలు కేంద్రాల్లో నెలన్నర క్రితం కుప్పలుగా పోసిన ధాన్యాన్ని బస్తాలకెత్తితే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. అకాల వర్షాలకు ఽఇప్పటికే సగం ధాన్యం తడిసి మొలకెత్తింది. వరదలో కొట్టుకుపోయింది. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి రైతుల కళ్లలో నీటి సుడులు తప్ప మరేమీ కన్పించడం లేదు.
కొన్నది కొంతే.. ఉన్నది మరెంతో..
వికారాబాద్ జిల్లాలో పది వేల మెట్రిక్ టన్నులకుపైగా, రంగారెడ్డి జిల్లాలో ఏడు వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంది. సోమవారంలోగా సేకరణ పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రెండు వారాలకు మించి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సేకరించిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో పడటం లేదని రైతులు వాపోతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ట్రాక్టర్ కిరాయి, డీజిల్ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సి వస్తోంది. పంటసాగుకు 120 రోజులు పడితే ధాన్యం అమ్మకానికే రెండు నెలలు పడుతుండటం ఇబ్బందిగా మారింది. సాయంత్రం కురిసే వర్షాలకు ధాన్యం తడిసిపోతుండటంతో ఉదయం ఆరబోయడం, సాయంత్రం కుప్ప నూర్చడమే పనిగా మారింది.
మిల్లులో ఖాళీ లేక.. లారీలు రాక
వికారాబాద్‌లో ఎనిమిది, రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది రైసు మిల్లులను ఎంపిక చేశారు. ఆయా మిల్లులన్నీ ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాల నుంచి లారీలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని అన్‌లోడ్ చేసే పరిస్థితి లేదు. ఒక్కో లారీ వారం పాటు రైస్‌మిల్లుల ముందే నిరీక్షించాల్సి వస్తోంది. తూకంలోనూ అనేక మోసాలకు పాల్పడుతున్నారరు. కొనుగోలు కేంద్రంలోనే బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. తీరా తూకం వేసిన తర్వాత మిల్లర్లు మరో రెండు కేజీల చొప్పున తగ్గించి బిల్లులు జారీ చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు నిరాకరిస్తున్నారు. విధిలేని పరిస్థితతుల్లో తక్కువ ధరకే వదిలించుకోవాల్సిన దుస్థితి.
సీఎం సాబ్.. జరదేఖో
ధాన్యం కొనుగోలులో జాప్యంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళనకు దిగాయి. కొనుగోలు కేంద్రాల వేదికగా రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. అయినా ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు ఉన్నాయి. సీఎం సొంత ఇలాకాలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
● రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలి
● కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. రైతులకు సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు తదితర అంశాలపై నాబార్డ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, డ్రిప్, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులతో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా మిషన్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగులో జిల్లా 5వ స్థానంలో ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఉల్లిగడ్డ గిడ్డంగులు, వర్మి కంపోస్ట్ యూనిట్లు, పట్టు పరిశ్రమకు సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున పండ్లు, కూరగాయలు, పూల తోటలు సాగు చేయడం మంచిదన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అంశం వికారాబాద్ రంగారెడ్డి
వరిసాగు విస్తీర్ణం 1.30 లక్షల ఎకరాలు 87,344 ఎకరాలు
ఎకరాకు సగటు దిగుబడి 26 క్వింటాళ్లు 26 క్వింటాళ్లు
దిగుబడి అంచనా 3.40 లక్షల మెట్రిక్ టన్నులు 80 వేల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు 129 37
ధాన్యం సేకరణ లక్ష్యం 1.10 లక్షల మెట్రిక్ టన్నులు 40 వేల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు కొనుగోలు 34 వేల మెట్రిక్ టన్నులు 21,600 వేల మెట్రిక్ టన్నులు
ఎంపిక చేసిన రైస్‌మిల్లులు 8 ఉండగా, అన్ని నిండిపోయాయి 8లో రెండు నిరాకరణ
రైస్ మిల్లులకు తరలించింది 24 వేల మెట్రిక్ టన్నులు 17 వేల మెట్రిక్ టన్నులు
రైతుల ఖాతాల్లో నగదు జమ రూ.49 కోట్లు రూ.30 కోట్లు
మార్కెట్‌లో ఉన్న ధాన్యం 10 వేల మెట్రిక్ టన్నులు 7 వేల మెట్రిక్ టన్నులు
మనింటికి వచ్చింది వాళ్లే..
చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించిన బాలుడు
బైక్‌పై పారిపోతుండగా వెంటాడిన పోలీసులు
ఒకరు చిక్కగా మరొకరు పరారీ
‘నాకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేశా. 170 బస్తాల దిగుబడి వచ్చింది. బస్తాకు 3 కేజీల చొప్పున తరుగు తీశారు. చేసేది లేక ధాన్యాన్ని మిల్లులోనే విక్రయించాల్సి వచ్చింది’ అని వికారాబాద్‌జిల్లా దోమ మండలం రాకొండకు చెందిన గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘వరి కోసి నెలరోజులైంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసేందుకు స్థలం లేకపోవడంతో పొలంవద్దే కుప్పపోసి ఆరబోశాను. ఇప్పటికీ తూకం వేయలేదు’ అని మంచాల మండలం బోడకొండకు చెందిన పాండు గోడు వెళ్లబోసుకున్నాడు.


