పరిగి: మున్సిపల్ అభివృద్ధికి కృషిచేస్తానని చైర్ పర్సన్ రజిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పట్టణ కేంద్రంలోని 1,11వ వార్డుల్లో పట్టణ సభ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సహకారంతో పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రగతి ప్రణాళికలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి నివేదిక తయారు చేశామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తేవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లేశ్, డీఎస్పీ శ్రీనివాస్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


