అర్హులకు సంక్షేమ ఫలాలు
బంట్వారం: గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. కోట్‌పల్లి మండలం బీరోల్ సర్పంచ్ మోముల సుధాకర్ బుధవారం క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సర్సింగ్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఖాజమియా, ఉప సర్పంచ్ తలారి రాజు, నాయకులు సంగారెడ్డి, పాండురంగారెడ్డి, మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెళ్లికి రండి
అనంతగిరి: తన కుమారుడి పెళ్లికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. మంగళవారం నగరంలో స్పీకర్‌ను కలిసి వివాహ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
మర్పల్లి: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో సర్పంచ్ రమేష్ ఇస్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ముందుగా ముస్లింలతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, పార్టీ సీనియర్ నాయకులు రాము స్పీకర్, ముస్లిం మైనార్టీ నాయకులకు ఖర్జూరం పండు తిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్


