పెండింగ్ పనులు పూర్తి చేయాలి
మీర్‌పేట: బడంగ్‌పేట సర్కిల్ పరిధిలోని డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, సర్కిల్ అధికారులు, కాలనీల ప్రతినిధులతో కలిసి ఆయన మీర్‌పేట, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో పర్యటించారు. సాయినగర్ శ్మశాన వాటిక, మీర్‌పేట దోభీఘాట్‌ల అభివృద్ధితో పాటు ప్రశాంతిహిల్స్ డివిజన్‌లో పార్కులు, సీసీరోడ్ల ఏర్పాటుకు గతంలో నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు జరగలేదని జేసీకి వివరించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. విజ్ఞానపురికాలనీలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు, ప్రశాంతిహిల్స్ రోడ్ నెం–10లో ఓపెన్ జిమ్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ వెంకన్న, ఏఈ సౌమ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సిద్దాల దశరథ, మాజీ సర్పంచ్ పల్లె పాండుగౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్దా పవన్‌కమార్, నాయకులు చల్లా బాల్‌రెడ్డి, సిద్దాల శ్రీశైలం, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


