
ప్రజావాణికి 130 ఫిర్యాదులు
అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్‌ఓ మంగ్లీలాల్‌కు వివరిస్తూ అర్జీలు సమర్పించారు.
ఆసరా పెన్షన్లకు ఫేస్ రికగ్నేషన్
పెన్షన్ దారులకు ఫేస్ రికగ్నేషన్‌తో పెన్షన్ పంపిణీ జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోనిర్వహించిన కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 194 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లను ఎంపిక చేశామని వీరికి మొబైల్ ఫోన్లు అందజేస్తామన్నారు. వీటి ద్వారా ఫేస్ రికగ్నేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
పూడూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి నుంచి పూడూరు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలం కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయమన్నారు. అనంతరం పూడూరు డిప్యూటీ తహసీల్దార్ వెంకటచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేశ్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవి, నాయకులు అనిల్, శ్రీశైలం, ఆంజనేయులు, బుచ్చన్న, ప్రకాశ్ నాయకులు రవీందర్, కృష్ణాచారి, సుభాన్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రజక ఫెడరేషన్‌ఏర్పాటు చేయండి
రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు గోపి
పరిగి: రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి తమ కులస్తులకు న్యాయం చేయాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. రజకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరారు. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మొగులయ్య, జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, అనిల్, ప్రభాకర్, వెంకటయ్య, మల్లేశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
‘అనంతగిరి హాక్స్’
లోగో ఆవిష్కరణ
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతగిరి హాక్స్ టీషర్ట్, లోగోను సోమవారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుషురాం నాయక్, కార్యదర్శి వినోద్, ప్రతినిధులు నరేందర్, రమేశ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 130 ఫిర్యాదులు

ప్రజావాణికి 130 ఫిర్యాదులు