అనంతగిరి అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అనంతగిరి అభివృద్ధికి కృషి

Aug 26 2025 8:32 AM | Updated on Aug 26 2025 8:32 AM

అనంతగ

అనంతగిరి అభివృద్ధికి కృషి

● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

అనంతగిరి: అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూడూరు పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ నుంచి అనంతగిరికి చేరుకున్నారు. అనంతగిరి హరిత రిస్టార్ట్స్‌, వ్యూటవర్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. హరిత హోటల్‌ను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుని పర్యాటకులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేలా తీర్చదిద్దుతార ని చెప్పారు. నిరుద్యోగులకు హోటల్‌ బాధ్యతలు అప్పగించి టూరిస్టులకు మంచి ఆహారం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతగిరి అభివృద్ధితో నిరుద్యోగులకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకుని హరిత హోటల్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, టూరిజం ఈడీ ఉపేందర్‌ రెడ్డి, డీఈ హన్మంత్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

పూడూరు: మద్యం తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కంకల్‌లో ఉన్న బృందావనం స్పిరిట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిస్టలరీస్‌ కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు, పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డుల పరిశీలన అనంతరం బేవరేజ్‌లో లిక్కర్‌ త యారీ ముడిసరుకు నుంచి బాటిల్‌ తయారీ వరకు ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో తెలుసుకున్నారు. మద్యం బాటిళ్ల భర్తీ ప్రక్రియలో లేబులింగ్‌ విధానాన్ని పరిశీలించారు. మంత్రి వెంట ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

అనంతగిరి అభివృద్ధికి కృషి 1
1/1

అనంతగిరి అభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement