సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Aug 26 2025 8:32 AM | Updated on Aug 26 2025 8:32 AM

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

● ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి

పూడూరు: టీఎస్‌ ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్య క్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓ పంక్షన్‌హాల్‌లో ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు త్వం నుంచి రావాల్సిన రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా రీజియన్‌ అధ్యక్షుడిగా సాయన్న, కార్యదర్శిగా అబ్ధుల్‌ మునీరా రెండో పర్యాయం నియ మితులయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, సత్యం, రాజారెడ్డి, రంగారెడ్డి రీజినల్‌ సెక్రటరీ అబ్ధుల్‌ జబ్బార్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement