
ఇళ్ల నిర్మాణంలో దూసుకెళ్తున్నాం
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తాండూరు నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గోనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాలో తాండూరు మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీను, డైరక్టర్ ఉదయ్ భాస్కరెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం ఉన్నారు.
రహదారి నిర్మాణ పనుల పరిశీలన
యాలాల: మండల పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పరిశీలించారు. రసూల్‌పూర్ నుంచి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోరోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో తొలగించిన దుకాణాలను పరిశీలించారు.