పోస్టర్‌ బాగుంది  – నాగార్జున | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ బాగుంది  – నాగార్జున

Published Sun, Feb 19 2023 2:49 AM

Nagarjuna in a film event - Sakshi

‘‘ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్‌ అయి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను నాగార్జున రిలీజ్‌ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్‌ బాడిస, కెమెరా: వాసు.

Advertisement
 
Advertisement
 
Advertisement