ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. | TTD Governing Body Meeting Concluded | Sakshi
Sakshi News home page

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు..

Aug 7 2023 3:38 PM | Updated on Aug 7 2023 3:51 PM

TTD Governing Body Meeting Concluded - Sakshi

( ఫైల్‌ ఫోటో )

తిరుమల: అన్నమయ్య భవన్‌లో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. వివిధ అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బార్డెడి చెప్పారు. 4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యార్దం షేడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల సౌకర్యార్ధం మరమత్తు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో రోండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.4.5 కోట్ల వ్యయంతో  నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికరణ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

రూ.23.5 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు చెప్పారు. రూ.3.1 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. 9.85 కోట్ల వ్యయంతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 2.6 కోట్లు వ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన 118 కోట్లు కేటాయింపు చేసినట్లు చెప్పారు.

టీబీ వార్డు ఏర్పాటు..
యస్వీ ఆయిర్వేద కళశాల అభివృద్ది పనులుకు 11.5 కోట్లు కేటాయింపు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు.రూ. 11 కోట్లతో యస్వీ సంగీత కళశాల అభివృద్ది పనులుకు కేటాయింపు చేశామని వెల్లడించారు. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు రూ. 1.25 కోట్లు కేటాయించామని చెప్పారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పోడిగింపు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.5 కోట్ల వ్యయంతో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement