మహిళా సెక్యూరిటీకి లైంగిక వేధింపులు | - | Sakshi
Sakshi News home page

మహిళా సెక్యూరిటీకి లైంగిక వేధింపులు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

శ్రీకాళహస్తి: తనను సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మహిళా సెక్యూరిటీ గార్డు చేసిన ఆరోపణలపై ఆలయ అధికారులు స్పందించారు. ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి నిలుపుదల చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఏఈఓ మోహన్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెరువులో మునిగి వ్యక్తి మృతి

నాయుడుపేట టౌన్‌: చెరువులో దిగి ఊపిరాడక పుట్టు ఆదిశేషయ్య(35) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని మేనకూరు పంచాయతీ, యర్రపశెట్టిపాళెం గ్రామ చెరువులో ఆదిశేషయ్యకు సంబంధించిన బంధువుల పశువులు దిగడంతో వాటిని బయటకు తొలేందుకు చెరువులో దిగగా ఒక్కసారిగా ఊబిలో కూరుకుపోయి మునిగిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని ఆదిశేషయ్యను వెలికితీశారు. అప్పటికే తను మృతిచెందినట్లుగా గుర్తించారు. ఏఎస్‌ఐ ధర్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement