నాయుడుపేటలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

నాయుడుపేటలో అగ్నిప్రమాదం

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

● భయాందోళనకు గురైన స్థానికులు

నాయుడుపేట టౌన్‌: నాయుడుపేట పట్టణంలోని చైతన్య ఆస్పత్రి సమీపంలోని ఓ భవనంలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, అగ్నిమాపకశాఖ అధికారుల కథనం.. చైతన్య ఆస్పత్రి వీధి సమీపంలో ఉన్న ఓ భారీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా కాల్చినప్పుడు నిప్పురవ్వలు భవనంలో పడి మంటలు రేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత ఏడేళ్లుగా ఈ భవనాన్ని బ్యాంకు అధికారులు సీజ్‌ చేసి ఉన్నారు. ఈ భవనంలో పాత అట్ట పెట్టెలు, కొంతమేరకు ఐటీసీకి సంబంధించిన సరుకులు, ఇతర సామగ్రి ఉన్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదంలో రూ.50 వేల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు నాయుడుపేట అగ్నిమాపక శాఖ అధికారి కే.సునీల్‌ తెలిపారు. సూళ్లూరుపేట అగ్నిమాపకశాఖ అధికారి హరీష్‌తో పాటు స్థానిక లీడ్‌ ఫైర్‌మన్‌ సుందరం, ఫైర్‌మన్‌ మురళి, పరశురామయ్య, సూళ్లూరుపేట అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement