శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

శ్రీకాళహస్తి: కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్తీక సోమవారం నాడు స్వామిని దర్శించుకోవడంతోపాటు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దీపాలు వెలిగించారు. రాహుకేతు పూజలు కూడా పెద్ద సంఖ్యలో చేసుకున్నారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షించారు. అలాగే పట్టణంలోని నారద పుష్కరిణిలో రాత్రి లక్ష దీపారాధన చేశారు. మూడో వారం వైష్ణవ కోనేరులో దీపాలు వెలిగించాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి స్వామి, అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. పాలక మండలి చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement