కళత్తూరు ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్‌? | - | Sakshi
Sakshi News home page

కళత్తూరు ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్‌?

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

– కేవీబీపురంలో కలకలం

కేవీబీపురం: సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో గెలుపొందిన కళత్తూరు ఎంపీటీసీ పట్టాభిరెడ్డి కిడ్నాప్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తెలిపిన మేరకు.. కేవీబీ పురం మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 6 టీడీపీ, 6 వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఎంపీపీ పీఠం కై వసం చేసుకునేందుకు ఒక ఎంపీటీసీ అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఓటింగ్‌ కేంద్రం వద్ద హడావిడి చేసిన టీడీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ ఆ సమయంలోనే కళత్తూరు ఎంపీటీసీ సభ్యుడు పట్టాభిరెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన పక్క రోజు నుంచి ఆయన ఇంటి వద్ద లేకపోగా ఆయన ఫోన్‌ సైతం స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. టీడీపీ కో–ఆర్డినేటర్‌ కనుసన్నల్లో ఎంపీటీసీ పట్టాభిరెడ్డి కిడ్నాప్‌నకు గురయ్యాడని, ఆయనను తిరుపతిలోని ఓ ప్రైవేటు ప్రాంతంలో గోప్యంగా ఉంచినట్లు సమాచారం. పార్టీ శ్రేణలు వారి కుటుంబ సభ్యులను సంప్రదించినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతుండడం గమనార్హం.

ఇక్కడే కొనసాగించండి

సూళ్లూరుపేట రూరల్‌: తమ ప్రాంతంలో ఉన్న నామినేషన్‌ సెంటర్‌ను ఇక్కడే కొనసాగించాలని తీర ప్రాంత గ్రామ ప్రజలు ఆర్డీఓ దేవేంద్రర్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావుకు సోమవారం వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాలైన కొరిడి, దామరాయి, కడపట్ర పంచాయతీ ప్రజలు గత 60 ఏళ్లుగా సర్పంచ్‌ ఎన్నికలు, ఇతర ఏన్నికల నామినేషన్‌ సెంటర్‌ను రాగన్నపటేడ్డ పాఠశాల వద్ద ఏర్పాటు వేసేవారని, ఇప్పుడు కొందరు వ్యక్తులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఉన్న నామినేషన్‌ సెంటర్‌ను అటకానితిప్ప గ్రామంలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 3,500 ఓటర్లు ఉన్నారని, ఈ ప్రాంతంలోనే నామినేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఒంటరి ఏనుగు హల్‌చల్‌

తిరుపతి రూరల్‌: ఎర్రావారిపాలెం మండలం, తలకోన రోడ్డుపై ఒంటరి ఏనుగు సంచారం కలకలం రేపుతోంది. తలకోన మూడో వంక సమీపంలోని ఏనుగుల బోర్డు పడమర వైపు ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఈ ఏనుగు సమీపంలోని ఊటబావులపల్లి, పులిబోనుపల్లి పరిసర ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement