రాపూరు: మండలంలోని గోనుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈగా రాజారెడ్డి తన అనుచరులతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు మరో వంద కుటుంబాలు వెఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలో చేరిన వారిని ఎస్‌ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, మండల కన్వినర్ బోడ్డు మధుసూదన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. ఎస్‌ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి నాయకత్వం పై నమ్మకంతో తాము, తన అనుచరులతో పార్టీ చేరినట్లు రాజారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ వలంటరీ విభాగం అధ్యక్షుడు నరసింహారెడ్డి, నెల్లూరు గిరిరెడ్డి, బండి పెంచల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


