తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 36 డివిజన్‌లోని 36/4వ పోలింగ్ కేంద్రంలో సోమవారం నిర్వహించిన రీ పోలింగ్ ప్రక్రియలో 50.38 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో మొత్తం 925 ఓటర్లకు కాగా 466 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే ఆదివారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఇదే పోలింగ్ కేంద్రంలో 515 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలిస్తే రీ పోలింగ్‌లో 49 ఓట్లు తగ్గాయి. కాగా ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ మేయర్ అభ్యర్థులతో పాటు కార్పొరేట్ అభ్యర్థులు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.


