ఎవరికీ మినహాయింపు లేదు | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ మినహాయింపు లేదు

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

తిరుపతి అర్బన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో డ్యూటీల కేటాయింపు ప్రకారం ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో డీఆర్వోలతో ఎన్నికల డ్యూటీలపై చర్చించారు. ఏ ఒక్క అధికారికి, సిబ్బందికి మినహాయింపు లేదని, అంతా పాల్గొనాలని ఆదేశించారు. ఈ నెల 4న తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో తప్పనిసరిగా రిపోర్ట్‌ చేయాలని చెప్పారు. అనంతరం 5వ తేదీ పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. పీవోలు, ఏపీవోలు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 4, 5 తేదీల్లో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్న పేర్కొన్నారు.

నేడు ఆర్చరీ జిల్లా జట్ల

ఎంపిక పోటీలు

తిరుపతి ఎడ్యుకేషన్‌:స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి చిత్తూ రు జిల్లా ఆర్చరీ అండర్‌–14, 17, 19 బాలబా లికల జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నా రు. ఈ పోటీలను శ్రీకాళహస్తిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు సాంబశివరావు, అమ్మలు సోమవా రం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ సొంత క్రీడాపరికరాలతో ఉదయం 9గంటల్లోపు హాజరవ్వాలని, మరిన్ని వివరాలకు 92905 02041 నంబరులో సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement