పుల్లంపేట : మండలంలోని వత్తలూరు పంచాయతీ దేవసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు తల్లెం బాలసుబ్రమణ్యంరెడ్డి, పట్టెం సుబ్రమణ్యం వారి అనుచరులు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని భావించి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. నేతలు ముద్దా రంజిత్‌రెడ్డి, మూగ వెంకటరెడ్డి, తల్లెం సుధీర్‌రెడ్డి, పాపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రెడ్డెయ్యరెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి పాల్గొన్నారు.


