రౌడీ రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రౌడీ రాజ్యం

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

చిత్తూరులో ఇష్టార్జాంగా దాడులు.. నామినేషన్ల అపహరణ కుప్పంలో వైఎస్సార్‌సీపీ దళిత అభ్యర్థి కిడ్నాప్‌ నగరిలో ప్రతిపక్ష అభ్యర్థుల దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరణ ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు

ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన ఎన్నికలను టీడీపీ అపహాస్యం చేసింది. ప్రజలు ఓట్లు వేసి, సిరా చుక్కపెట్టుకుని ఇవ్వాల్సిన తీర్పును.. రక్తపుటేర్లతో పచ్చమూక బలవంతంగా లాగేసుకుంటోంది. మున్సిపల్‌ ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ఘట్టం ఓ యుద్ధాన్ని తలపించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి అధికార పార్టీ అరాచకానికి పాల్పడింది. ఈ క్రమంలో పోలీసు, అధికార యంత్రాగం మౌనంగా చోద్యం చూస్తూ నిలబడింది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. టీడీపీ నేతల స్వైరవిహారంతో ప్రజాస్వామ్యం కుదేలైంది. వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్‌గా పచ్చమూక రెచ్చిపోయింది. దాడులు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

కుప్పంలో మొదలు..

చిత్తూరు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభంకాగానే కుప్పంలో హింసాకాండకు టీడీపీ నేతలు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌ను కిడ్నాప్‌చేసి, కారులో తీసుకెళ్లిపోయారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాజ్‌కుమార్‌, జయశంకర్‌, హఫీజ్‌ను రక్తం వచ్చేలా చావబాదారు. సాక్షి రిపోర్టర్‌ వెంకటాచలంపై దాడికి యత్నించారు.

చిత్తూరులో..

చిత్తూరు కార్పొరేషన్‌లోని సత్యనారాయణపురం నామినేషన్‌ కేంద్రంలో 14వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి లక్ష్మీ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక్కడ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంజలిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ నాయుడు అనుచరులు కుమార్‌, నాయుడుతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు సయ్యద్‌ బాషాను కాళ్లతో తన్నుతూ, బండరాయితో తలపై మోది రక్తం వచ్చేలా కొట్టారు. కొంగారెడ్డిపల్లెలోని బాపూజీనగర్‌ నామినేషన్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ దరఖాస్తుల్లోని పలు పత్రాలను టీడీపీ నేతలు తీసుకెళ్లిపోయారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మురళీని చావబాదారు.

నగరిలో..

నగరిలో చైర్మన్‌ అభ్యర్థిగా పదిసెట్ల నామినేషన్లను ఆర్‌ఓ ఏకపక్షంగా తిరస్కరించారు. బాలకృష్ణతో పాటు రమేష్‌రెడ్డి, వెంకటరత్నం నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని ఉదయం ఫామ్‌–7 ఇచ్చిన అధికారులు.. సాయంత్రానికి టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలమనేరులో..

పలమనేరులోని 1, 2 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఫయాజ్‌, నవీన నామినేషన్లు తిరస్కరించారు. 36వ వార్డు అభ్యర్థి రహీంఖాన్‌ సతీమణి గుల్జార్‌ నామినేషన్‌ తొలగించడంతో రహీంఖాన్‌ సొమ్మసిల్లి పడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement