నిబంధనలు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అమలు చేయండి

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

● ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణలో కలెక్టర్‌

తిరుపతి అర్బన్‌: ‘హ్యాడ్‌ బుక్‌ను శ్రద్ధగా చదువుకోండి.. అందులోని ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయండి’ అని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) సహాయక రిటర్నింగ్‌ అధికారి (ఏఆర్వో)లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, జెడ్పీ సీఈవో శోభనబాబుతో కలసి శిక్షణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనలపై పూర్తి అవగాహన పొందాలని, విధులను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ అంశాల్లో ఎలక్షన్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత పొందాలని సూచించారు. తమ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫారమ్‌–బీని నిర్దేశిత గడువులోపు సమర్పించేలా చూడాలని, నామినేషన్ల పరిశీలన రోజున సాయంత్రం 5 గంటల్లోపు సమర్పణకు సంబంధించిన నిబంధనలను అనుసరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో రమణప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement