నిబంధనలకు తూట్లు.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు తూట్లు..

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

● మన బడి– మన భవిష్యత్తుకు ‘చంద్ర’ గ్రహణం ● రెండున్నరేళ్లుగా పాఠశాలల అభివృద్ధికి నిధులు శూన్యం ● ఎక్కడికక్కడ ఆగిపోయిననిర్మాణ పనులు ● మొండిగోడలకే పరిమితమైనప్రభుత్వ స్కూళ్లు ● విమర్శలు గుప్పిస్తున్న తల్లిదండ్రులు – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆల యమై న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మా ణంలో నిబంధనలు పాటించడం లేదు.
నిందితుడి అరెస్ట్‌
పేపర్‌ను అడ్డుగా పెట్టుకుని సెల్‌ఫోన్‌, బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు సైతం కార్పొరేట్‌ విద్యనందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మన బడి నాడు–నేడు పథకాన్ని తీసుకొచ్చింది. మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను

సమూలంగా మార్చేసింది. ఇంగ్లిష్‌

మీడియాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్‌ విద్యతో పోటీ పడేలా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. మన బడి–మన భవిష్యత్తు అని పేరు మార్చి చేతులు పైకెత్తేసింది.

రెండున్నరేళ్లుగా నిధులు కేటాయించకుండా మొండికేస్తోంది. మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులు ఎక్కిరిస్తున్నా ‘మేమేం

చేసేది’ అంటూ ధిక్కరిస్తోంది. మన బడి–మన భవిష్యత్తుకు పట్టిన ‘చంద్ర’ గ్రహణంపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌.

కేవీబీపురం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా

విద్యాలయంలో అర్ధంతరంగా ఆగిన అదనపు తరగతి గదుల భవనం

సూళ్లూరుపేట మండలం, దామానెల్లూరు జెడ్పీ హైస్కూల్లో

పునాది దశలోనే ఆగిన అదనపు తరగతి గదులు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వంపై కక్ష సాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేస్తోంది. గతంలో నాడు– నేడులో చేపట్టి మధ్యలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాల్సింది పోయి.. ‘మాకేం సంబంధం’ అన్నట్టు మిన్నకుండిపోతోంది. కొన్ని చోట్ల మొండిగోడలు దర్శనమిస్తుండగా.. ఇంకొన్ని చోట్ల స్టీలు తుప్పుపట్టి రాలిపోతున్నాయి.

మురుగుతున్న రూ.8.2 కోట్లు

మన బడి–మన భవిష్యత్తు (నాడు–నేడు) పథకంలో భాగంగా అభివృద్ధి పనులకు ఆయా పాఠశాలల ఖాతాలోనే ఇదివరకు నిధులను కేటాయించారు. అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ పలు పాఠశాలల ఖాతాలో నాడు–నేడు కింద ఇచ్చిన నిధులు మిగులులో ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.8.2కోట్ల నిధులు ఆయా పాఠశాలల ఖాతాలో మురుగుతున్నాయి. ఆ నిధులను వినియోగించైనా ఆగిన నిర్మాణాలు పూర్తి చేయాలని వేడుకుంటున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవగాహన ఏదీ

మన బడి–మన భవిష్యత్తు పనులు పాఠశాల విద్య, సర్వశిక్ష ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆయా పాఠశాలల ఖాతాలో ఉన్న నిధులను అవసరమైన పాఠశాల ఖాతాకు బదిలీ చేసే సదుపాయం ఉంది. దీనికోసం సర్వ శిక్ష ఏపీసీ కలెక్టర్‌కు నివేదించి, కలెక్టర్‌ అనుమతితో బదిలీ చేసుకోవచ్చు. పనులు ఆగిన పాఠశాలల నుంచి ఎంత మొత్తం నిధులు అవసరమవుతాయో జాబితా తెప్పించుకుని ఆయా పాఠశాలలకు నిధులు కేటాయించే బాధ్యత సర్వశిక్షలోని సెక్టోరియల్‌ అధికారులపై ఉంది. అయితే దీనిపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగహన కల్పించడంలో సెక్టోరియల్‌ అధికారులు విఫలమవ్వడంతో పాఠశాలల ఖాతాలో ఉన్న నిధులు నిరుపయోగంగా మారాయి.

నేడు సర్వనాశనం

నాడు స్వర్ణయుగం

ఓజిలి మండలం, కురుగొండ ఉన్నత పాఠశాలలో ఆగిన

అదనపు తరగతి గదుల భవనం

బుచ్చినాయుడుకండ్రిగ జెడ్పీ హైస్కూల్లో అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదుల భవనం

కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాడు–నేడు పథకాన్ని మన బడి–మన భవిష్యత్తు అని పేరు మార్చింది. అయితే రెండో విడతలో ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారు చేసింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా దాదాపు 217 పాఠశాలల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. బుచ్చినాయుడు కండ్రిగ జెడ్పీ హైస్కూల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. సూళ్లూరుపేట మండలం, దామానెల్లూరు జెడ్పీ హైస్కూల్లో పునాది దశలోనే ఆగిన పరిస్థితి కనిపిస్తోంది. ఓజిలి మండలం, కురుగొండ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, కేవీబీపురం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, నాయుడుపేట మండలంలోని 14 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు వివిధ దశల్లోనే నిలిచిపోయి సర్వనాశనమవుతున్నాయి.

గతంలో మన బడి నాడు–నేడు పథకంలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొదటి విడతలో 1,533 పాఠశాలలను ఎంపికచేశారు. ఆయా పాఠశాలల ఆధునీకరణకు దాదాపు రూ.369 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులతో 9 రకాల మౌలిక వసతులతో కూడిన 11,245 పనులు చేపట్టారు. మొదటి విడత ముగిసే సమయానికి దాదాపుగా 11,103 (98.74శాతం) పనులు పూర్తయ్యాయి. ఇక రెండో విడతలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభన చేశారు. తిరుపతి జిల్లా ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. తిరుపతి జిల్లాలో రెండో విడత కింద మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి చేయడానికి 1,079 పాఠశాలలను ఎంపిక చేశారు. దీనికోసం రూ.367.33 కోట్లు కేటాయించారు. మొదట ప్రాధాన్యతగా 862 పాఠశాలల్లో దాదాపు 96 శాతం పనులు పూర్తి చేయగా.. మిగిలిన 217 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, టాయ్‌లెట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లోనే ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement