‘ఆధార్‌కు’ రెండు కిలోల ఉల్లిపాయలు | - | Sakshi
Sakshi News home page

‘ఆధార్‌కు’ రెండు కిలోల ఉల్లిపాయలు

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

● శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిలిపివేత

తిరుపతి అర్బన్‌: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, గుంటూరు రైతు బజార్‌ సీఈవో మాధవీలత ఆదేశాల మేరకు జిల్లా మార్కెట్‌ కమిటీ అధికారులు తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ సమీపంలోని రైతు బజారు వద్ద ఉల్లిపాయలకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్‌ కార్డు చూపించిన వారికి రెండు కేజీల చొప్పున కిలో రూ.35 లెక్కన ఎర్రగడ్డలు పంపిణీ చేయనున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి తుడా: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 21 ఆశా వర్కర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 18, పట్టణ ప్రాంతాల్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈనెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

వసతి గదుల్లో నీటి కొరత

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన వసతి గదుల్లో నీటి కొరత ఏర్పడింది. ఆలయ అధీనంలోని భరద్వాజ తీర్థం సమీపంలో గంగా సదన్‌, కై లాస సదన్‌ ప్రాంతాల్లో నిర్మించిన వసతి గదుల్లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులకు గదులు కేటాయించే ప్రక్రియతో పాటు ఆన్‌లైన్‌ బుకింగ్‌ను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నీటి సమస్య కారణంగా బుకింగ్‌ నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

ఒలింపిక్‌లో గోల్డ్‌ మెడలే లక్ష్యం

నాయుడుపేట టౌన్‌: ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని ఆర్చరీ క్రీడల్లో రాణిస్తున్న నాయుడుపేట ఆర్చరీ క్రీడాకారుడు తిరుమూరు గణేష్‌ మునిరత్నం స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసియా ఆర్చరీ క్రీడా పోటీల్లో బంగారు పతకం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించినట్టు వెల్లడించారు. పురుఫుల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌తో కలసి పోటీల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

సీఈసీ రాజీనామా చేయాలని నిరసన

తిరుపతి కల్చరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నాలుగు కాళ్ల మండపం నుంచి గోవిందరాజస్వామి ఆలయ కోనేరు, విష్ణు నివాసం, గ్రూప్‌ థియేటర్స మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, పి.మురళి మాట్లాడుతూ ఏఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగింపునకు గురైన అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం, సీపీఐ నేతలు వేణుగోపాల విశ్వనాథ్‌, సుబ్రమణ్యం, రాధాకృష్ణ, ఎస్‌.జయచంద్ర, సాయిలక్ష్మి, చిన్నం పెంచలయ్య, ఎన్‌డీ.రవి, నదియాబుజ్జి, నరేంద్ర, శివ, ప్రవీణ్‌, పార్థసారథి, శ్రీనివాసులు, మల్లికార్జున్‌రావు, వీరేష్‌, షకీలా, సునీత, మంజుల, ప్రమీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement