భారత జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం షాపులకు సెలవు ఇచ్చి షాపులకు ముందేమో సీల్ వేశారు. వెనుకేమో సేల్స్ చేసుకోమని సాక్షాత్తూ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులే పరిమిషన్ ఇచ్చినట్టుగా అమ్మకాలు జరిగాయి. సూళ్లూరుపేట పట్టణంలో డిమాండ్‌ను బట్టి క్వార్టర్ బాటిల్ మీద రూ.20 నుంచి రూ.50 పెంచి మరీ విక్రయాలు సాగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు షాపులకు ముందుగానే భారీగా స్టాక్ కూడా పంపించారు. గాంధీ జయంతి రోజున మందు బాబులు చిందులేయడం, తాగేసి పడిపోవడం లాంటి సిత్రాలు కనిపించాయి. ప్రతి మద్యం షాపు ముందేమో సీల్ వేసి.. షాపు వెనుక భాగంలో, లేదంటే పక్కనే ఉన్న బంకుల్లో మద్యం పెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు సాగించారు.
– సూళ్లూరుపేట


