తిరుపతి కల్చరల్: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనున్న గాంధీ విగ్రహానికి ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, రంగస్థలి కళాకారులు, కార్మిక సంఘాల నేతలు నివాళులర్పించారు.


