కండలేరులో అడుగంటిన నీటి మట్టం
కాలువలకు నీరు విడుదల
కండలేరు జలాశయం ద్వారా ప్రతి ఏటా కాలువలకు నీటిని విడుదల చేసేవారు. అలాగే సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లోని చెరువులకు కండలేరు జలాలను నింపేవారు. ప్రస్తుతం కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2 వేల క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 5క్యూసెక్కులు, హైలెవల్ కాలువకు 50 క్యూసెక్కులు, లోలెవల్ కాలువకు 50 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కులు వంతున నీటిని విడుదల చేస్తున్నారు.
కండలేరు జలాశయం
కండలేరు..
సైదాపురం: కండలేరు జలాశయం రోజురోజుకూ అడుగంటుతోంది. ఏగువ ప్రాంతాల నుంచి నీరు రాకపోవడంతో డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంటోంది. జలాశయం ఇప్పటికే 20 టీఎంసీలకు పరిమితమైంది. ప్రధానంగా సర్వేపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల రైతులు కండలేరు జలాశయంపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. ఈ ప్రాంతాల్లో చెరువులు నిండితేనే వరి పంట పండేది. అయితే సాగు నీటి కోసం కాలువలు తవ్వించిన తర్వాత ఆ పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కినా నాన్ డెల్టాకు సాగునీటి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రస్తుతం సోమశిలలో 20 టీఎంసీలు, కండలేరులో 20 టీఎంసీలు నీటి నిల్వలు ఉండడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. కండలేరులో రోజు రోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండడంతో ఆయకట్టు రైతులకు ఆందోళన చెందుతున్నారు.
ఇన్‌ఫ్లో లేదు
శ్రీశైలం ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్లు పుణ్యమా అని సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో రావడం లేదు. దీనికితోడు సోమశిలకు ఈ సీజన్ కంటే ముందే వరదనీరు వచ్చి ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరిగేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం ఆగిపోయింది. దీంతో కండలేరు జలాశయంలో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి.
అవసరం ఇలా..
కండలేరు జలాశయం పరిధిలో సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు ప్రస్తుత రబీలో సాగు నీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంది.


