నేడు స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

నేడు స్పాట్‌ అడ్మిషన్లు

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పలు డిప్లొమో కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మిగిలి ఉన్న సీట్లకు శనివారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎస్వీయూ రీజియన్‌కు సంబంధించి సీఎమ్‌ఈ బ్రాంచ్‌లో రెండు, ఈఈఈ కోర్సులో ఒకటి ఖాళీలు ఉన్నాయని, అలాగే ఏయూ రీజియన్‌లో బయోమెడికల్‌, సీహెచ్‌ఎస్‌టీ బ్రాంచ్‌లలో మూడు చొప్పున సీట్లు ఖాళీలున్నాయని తెలిపారు. అర్హత గల విద్యార్థులు అన్ని ధృవపత్రాలతో శనివారం కళాశాలలో జరిగే స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 ర్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 66,437 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,771 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

పీ4, పీపీపీలపై సీఎం సమీక్ష

తిరుపతి తుడా: ీప4, పీపీపీ విధానాలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లానన్‌ యూనిట్లు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం అమరావతి నుంచి నిర్వహించిన ప్రత్యేక వర్చువల్‌ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ నుంచి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్‌ జయకృష్ణ, అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్లు, పీ4, కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ తదితరాలపైఔ సమీక్షించారు.

నేటి నుంచి

డాక్టర్స్‌ రిజిస్ట్రేషన్‌ క్యాంప్‌

తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులకు రిజిస్ట్రేషన్‌ సంబంధిత సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్‌ వైద్య మండలి ‘మీ ఇంటి వద్దకే రిజిస్ట్రేషన్లు’ అనే జిల్లా రిజిస్ట్రేషన్‌ శిబిరాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎస్వీ మెడికల్‌ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ‘రిజిస్ట్రేషన్‌న్‌ ఎట్‌ యువర్‌ డోర్‌స్టెప్‌ 2.0’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల రీ రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌, అడిషనల్‌ విద్యార్హతల నమోదు వంటి సేవలు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement