తిరుపతి అర్బన్: డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు అనే నినాదంతో యువత ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలో కలెక్టర్‌తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, శాఫ్ చైర్మన్ రవినాయుడు అమరావతి చాంపియన్‌షిప్ విన్నర్స్, రన్నర్స్‌తో కలసి యాంటీ డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం క్రీడాకారులు, విద్యార్థులు, యువతతో యాంటీ డ్రగ్స్‌పై ప్రతిజ్ఞ చేయించారు.
గంజాయి రాపిడ్ టెస్టులో
450 మందికి పాజిటివ్
జిల్లాలో 12 వేల మందికి గంజాయి రాపిడ్ టెస్టులు చేయగా.. అందులో 450 మందికి పాజిటివ్ వచ్చిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వారిలో 350 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి స్పెషల్ టాస్క్‌పోర్స్, డాగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి ప్రధానంగా జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.


