ప్రతి నేతన్ననూ ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి నేతన్ననూ ఆదుకోవాలి

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

మృతిచెందిన వారిపై కూడా కేసు

అర్హులైన చేనేతలకు నిధులు

వెంటనే జమ చేయాలి

మున్సిపాలిటీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దాం

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి (సైదాపురం): మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవలో నిధులు విడుదల చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేతలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్రమంతప్పకుండా నేతన్న నేస్తం ద్వారా రూ.24 వేలు అందించిన ఘతన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అఽధికార పీఠం ఎక్కిన రెండేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో నిధులు కంటి తుడుపుగా కొందరికే జమ చేసిందని ధ్వజమెత్తారు. తమకు అందాల్సిన నిధులపై కడుపుమంటతో ఇటీవల రోడ్డెక్కి ధర్నా నిర్వహించిన చేనేతలపై అధికార పార్టీ నేతలు బైండోవర్‌ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఏకంగా మృతి చెందిన వ్యక్తిపై కూడా కేసులు పెట్టించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అధికారులు తప్పులు చేసి ఇబ్బందులు పడొద్దని హెచ్చరించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నిధులు జమయ్యే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెంకటగిరిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,205 మందికి నిధులు జమచేయగా ఈ ప్రభుత్వం 1,536 మందికి మాత్రమే నిధులు విడుదల చేసిందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకటగిరి మున్సిపాలిటీని గెలిపించి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రెండున్నారేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగి పోయారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికార పీఠం ఖాయమని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, ఆటంబాకం శ్రీనివాసులురెడ్డి, ఆరి శంకరయ్య, కల్లు సతీష్‌, సదానందరెడ్డి, పూజారి శ్రీనివాసులు, కందాటి రాజారెడ్డి, కళ్యాణి, పూజారి లక్ష్మి, కూనా మల్లికార్జున్‌, చింతం రంగరాజు, వలికల కృష్ణయ్య, తాపాటి కాటయ్య పాల్గొన్నారు.

కడుపు మంటతో ప్రశ్నిస్తే కేసులా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement