గరుడోత్సాహం | - | Sakshi
Sakshi News home page

గరుడోత్సాహం

Aug 29 2026 12:17 AM | Updated on Aug 29 2026 12:17 AM

తిరుమల: తిరుమలలో సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది. సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 7 నుంచి 9 గంటల మద్య జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శాంతారామ్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌వర్మ, చీఫ్‌ ఇంజినీర్‌ మనోహరం, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.

సర్‌పై నేటి నుంచి స్పెషల్‌ క్యాంపైన్‌

తిరుపతి తుడా: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా తిరుపతి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు స్పెషల్‌ క్యాంపైన్‌ డే నిర్వహించనున్నామని నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఎం.జయకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్‌లైము లు, అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు, సూపర్‌వైజర్లు విధిగా పాల్గొనాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement