తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ– నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ కష్ణస్వామివారిని శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత శ్రీకృష్ణస్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తిరిగి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు పాల్గొన్నారు.


