తిరుపతి సిటీ : పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎకో క్లబ్, యూత్ రెడ్ క్రాస్ కమిటీ వారు విద్యార్థులకు పక్షుల ప్రాముఖ్యత, ఆర్నిథెరపీ ద్వారా ఒత్తిడి నివారణ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ నారాయణమ్మ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా సమయపాలన, సానుకూల ఆలోచన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఆర్నిథెరపీని ఉపయోగించుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ద్వారా విద్యలోనూ, జీవితంలోనూ మంచి విజయాలను సాధించగలరని తెలిపారు. ఆర్నిథాలజిస్ట్ కార్తీక్ సాయి మాట్లాడుతూ పక్షుల వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, పక్షుల కిలకిలరావాల ద్వారా కలిగే సౌండ్ థెరపీ ప్రయోజనాలను వివరించారు.


