వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

తొట్టంబేడు: మండలంలోని కొత్తకండిగ గ్రామానికి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం మే రకు.. కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన ఎస్‌ రాజాకు అమరావతి అనే మహిళతో 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. అమరావతికి ముగ్గురు పిల్లలు ఉ న్నారు. కుటుంబ కలహాలు కారణంగా అమరావతి సోమవారం పురుగులు మందు తాగింది. బంధువుల సహాయంతో శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో తిరుపతిలోని రుయాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమికుల జంట ఆత్మహత్య

రాపూరు: మండల కేంద్రానికి సమీపంలోని వెలుగొండ అడవుల్లో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. రాపూరు–చిట్వేలి ఘాట్‌ రోడ్డులోని 7వ కిలోమీటర్‌ వద్ద అడవుల్లో ఉరివేసుకుని ఇద్దరు మృతి చెందినట్లు పంగిలి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జంట పక్కన హ్యాండ్‌ బ్యాగులో సెల్‌ఫోన్‌ ఉండగా గుర్తించారు. దాని ఆధారంగా మృతుల వివరాలను సేకరించినట్లు ఎస్‌ఐ వెంకటరాజేష్‌ తెలిపారు. మృతుడు ముతుకూరుకు చెందిన ప్రసన్నకుమార్‌(25), మృతురాలు చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన సావిత్రి (24)గా గుర్తించినట్లు తెలిపారు. సావిత్రికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వీరికి సోషల్‌ మీడియా ద్వారా పరిచమైనట్లు తెలుస్తుంది. అడవిలో ఇద్దరు ఒకే చెట్టుకు చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సంఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బా, ద్విచక్రవాహనం ఉన్నాయని పేర్కొన్నారు. ముందుగా పురుగుల మందు తాగి, ఆ తరువాత ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పా రు. సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించినట్లు విరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి

పెళ్లకూరు:నాయుడుపేట–పూతలపట్టు జాతీ య రహదారిలో చెంబడిపాళెం గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న ఓ రైతును మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు..చెంబడి పాళెం గ్రామానికి చెందిన మనుబోలు మధుసూదన్‌(48) అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మధుసూదన్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఆదిలక్ష్మి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెవిరెడ్డిపల్లి పీహెచ్‌సీ వైద్యుడు మృతి

వెంకటగిరి రూరల్‌: ప ట్టణంలోని చెవిరెడ్డిపల్లి పీహెచ్‌సీ వైద్యులు రవితేజ(38) చికిత్స పొందుతూ సోమ వారం తెల్లవారుజామున మృతి చెందారు. పట్టణంలోని చెవిరెడ్డిపల్లి పీహెచ్‌సీ వైద్యుడిగా పనిచేస్తున్న రవితేజ ఇటీవల అనారోగ్యం పాలవడంతో స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రవితేజ మృతి చెందడంపై వెంకటగిరి లోని పలువురు వైద్యులు దిగ్బ్రాంతి చెందారు.

కుక్కల దాడిలో 7 గొర్రెలు మృతి

కలువాయి(సైదాపురం): మండలంలోని మాదన్నగారిపల్లి ఎస్టీ కాలనీలోని గోమసాని వెంకటేశ్వర్లుకి చెందిన గొర్రెల మందపై సోమవారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 7 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి విలువ రూ.50 వేలు పైచిలుకు ఉంటుందని ఆరోపించారు. గ్రామంలో కుక్కల బెడద అఽధికంగా ఉందని పంచాయితీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement