తిరుపతి కల్చరల్: పౌరాణిక నాటకాల్లో ఆయన రంగస్థల రావణుడు, ఏకపాత్రాభినయంలో రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, యముడు, ఇలా ఏ పాత్ర ధరించినా అందులోకి ఒదిగిపోయి తన డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూత లూగించే నటుడు బి.క్రిష్ణానాయక్(68ళ). సోమవారం అర్థరాత్రి ఆయన గుండెపోటుతో మృతి చెందారు. నటుడిగా అద్భుత ప్రదర్శన చేయడంలో, ఆహార్యం, సంభాషణలు పలికే తీరు, నటనలో ఆయనకు ఆయనే సాటిగా పేరుతెచ్చుకుని ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 500పై చిలుకు నాటక ప్రదర్శనలతో తెచ్చుకున్న అవార్డులు, రివార్డులకు లెక్కలేదు. రంగస్థలం మీదే కాకుండా బుల్లితెరపై కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అంతటి లబ్ధి ప్రతిష్టులైన ఆయన నేడు భౌతికంగా దూరమయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన ఆకస్మిక గుండెపోటుకు గురై కళామాతల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. సుమారు 40 ఏళ్లపాటు ఆయన రైల్వేశాఖలో పని చేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో చీఫ్ టికెట్ ట్రావెలింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఉన్నతాధికారుల అనుమతి పొంది 1983లో సినీ రంగ ప్రవే శం చేశారు. ప్రేమ తపస్సు, క్షేత్రం, పుష్ప–1 చిత్రాల్లో నటించారు. ఓ వైపు రైల్వేలో పని చేస్తూనే అటు రంగస్థ లం కళాకారుడిగా, టీవీ నటుడుగా తన సత్తా చాటా రు. జ్యోతి, జానకి, ఒక సీ్త్రకథ, మనసు–మమత, నిండు నూరేళ్లు, నాలుగు స్తంభాలాట, వంటి సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు స్తంభాలాట సీరియల్‌లో తన కుమారుడు డాక్టర్ రవిశంకర్ రాథోడ్ హీరోగా నటిస్తే ఆయన విలన్‌గా నటించడం విశేషం. సొంత బ్యానర్‌లో ‘ఆత్మ’ సీరియల్ తీశారు. అలాగే తమిళంలో కూడా ఆయన పలు సీరియళ్లలో న టించారు. రైల్వేశాఖలో పనిచేస్తునప్పుడే సామా జిక స్పృహతో కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించి పోలీస్ శాఖకు సేవలందించారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఘరానా మొగుడు’ సీరియల్ జీ.తెలుగులో ప్రసారం అవుతోంది. మంగళవా రం మధ్యాహ్నం ఆయన పార్థివదేహాన్ని తిరు పతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని సృగృహానికి తీ సుకువచ్చారు. బుధవారం ఉదయం 9 గంటలకు గో విందధామంలో అంత్యక్రియులు నిర్వహించనున్న ట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు రైల్వే ఉద్యోగులు, రంగస్థల కళాకారులు, బుల్లితెర నటులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.


