తిరుమల: మత్తు మాత్రలిచ్చి బంగారు తాళిబొట్టు గొలుసు చోరీ చేసిన మహిళను తిరుమల పోలీసులు వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2020 జనవరి నెలలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన 72 ఏళ్ల వృద్ధురాలు తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలో బేడీ ఆంజనేయ స్వామి వద్ద ఆమెను నమ్మబలికిన ఓ మహిళ, టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. స్పృహ కోల్పోయిన ఆమె మెడలో ఉన్న సుమారు 73 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్‌ను అపహరించింది. ఈ ఘటనపై తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సోమవారం తిరుమల హెచ్‌టీ సముదాయం వాహనాల పార్కింగ్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి వద్ద నుంచి సుమారు 8.4 గ్రాముల బంగారు చైన్, 8 నిద్ర మాత్రలు, ఒక ఇనుప కట్టర్, ఒక చీర తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గుంటూరు జిల్లా జాన్సీ నగర్‌కు చెందిన ఎఫ్.బుజ్జిబాబు భార్య వల్లి (56)గా గుర్తించారు. నిందితురాలు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ఈస్ట్ ప్రాంతంలో తాత్కాలికంగా నివసిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు ఆమెను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.


