పదో తరగతి విద్యార్థుల ఇళ్లను సందర్శించిన డీఈఓ | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థుల ఇళ్లను సందర్శించిన డీఈఓ

Mar 3 2026 7:19 AM | Updated on Mar 3 2026 7:19 AM

తిరుపతి రూరల్‌: మండలంలోని కేసీ పేట పంచాయతీ భాగ్యనగరం ఎస్టీ కాలనీలో డీఈ ఓ కేవీఎన్‌ కుమార్‌ సోమవారం రాత్రి పర్యటించారు. దుర్గసముద్రం హైస్కూలులో చది వే పదో తరగతి విద్యార్థుల ఇళ్లను ఆయన సందర్శించారు. రాత్రి వేళ ఇంటి వద్ద విద్యార్థులు ఏం చేస్తున్నారన్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. సమయాన్ని వృథా చేయకుండా చక్కగా చదువుకుని మంచి మార్కులుతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రభు త్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి, ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగి వారి ప్రగతిని పరీక్షించారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతి విద్యార్థీ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వెనుక బడిన సబ్జెక్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి రోజూ పునశ్చరణకు సమయం కేటాయించాలని, మోడల్‌ ప్రశ్న పత్రాలను సాధన చేయాలని తెలిపారు. దుర్గసముద్రం హైస్కూలు హెచ్‌ఎం రవీంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement