నేత్రోత్సవం.. శ్రీవారి తెప్పోత్సవం
– 8లో
న్యూస్‌రీల్
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలోని తెప్పపై కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెప్పోత్సవాల్లో భాగంగా స్వామివారు పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన దశావతారాలు, పాండు రంగడు, పద్మావతి శ్రీనివాసుల రూపాలతో విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. – తిరుమల
నేత్రోత్సవం.. శ్రీవారి తెప్పోత్సవం
నేత్రోత్సవం.. శ్రీవారి తెప్పోత్సవం


