డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: అటానమస్ హోదా గుర్తింపు పొందిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 16 నుంచి జరిగిన డిగ్రీ మొదటి సంవత్సరం తొలి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలు జరిగిన పది రోజుల్లో ఫలితాలను విడుదల చేయడం గర్వంగా ఉందని, ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు, ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారులు అభి నందనీయులని కొనియాడారు. పలు కోర్సుల్లో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాఽధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీవీ చలపతి, డాక్టర్ కామేశ్వర్‌రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావాలి
– ఐసర్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఏర్పేడు: దేశంలో సైన్స్ ప్రపంచ దేశాలకు దీటు గా అభివృద్ధి చెందడం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమైందని, ప్రతి విద్యార్థి భావి శాస్త్రవేత్తగా ఎదగాలని తిరుపతి ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ అన్నారు. తిరుపతి ఐసర్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించే గొప్ప శాస్త్రవేత్త సీవీ రామన్ అని, ఆయన జయంతిని సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు తమ విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శనలు తిలకించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఐసర్ విద్యార్థులు సుమారు 200కు పైగా సైన్స్ మోడళ్లను ప్రదర్శించారు.
టాస్క్‌ఫోర్స్ ఎస్పీ (ఎన్‌సీ)గా కులశేఖర్ బాధ్యతల స్వీకరణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్:ఎరచ్రందనం అక్ర మ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ(నాన్ క్యా డర్)గా జె. కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదివరకే ఏఎస్పీగా టాస్క్ ఫోర్స్‌కు అటాచ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నా రు. అయితే ఖాళీగా ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పో స్టును భర్తీ చేయడంలో భాగంగా ప్రభుత్వం ని యామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ పీ. శ్రీనివాస్, డీఎస్పీలు వీ శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్, ఆర్‌ఐ సాయి గిరిధర్, సీఐ ఖాదర్ బాషా, ఎస్‌ఐ రఫీ అభినందనలు తెలిపారు. తరువాత జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
డిగ్రీ ఫలితాలు విడుదల


