మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌

Mar 1 2026 7:21 AM | Updated on Mar 1 2026 7:21 AM

మిన్న

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌

● ఉర్రూతలూగించిన ప్రఖ్యాత డీజే కాశిష్‌ రాథోడ్‌ ప్రదర్శన ● కేరింతలు కొట్టిన ఐఐటీ విద్యార్థులు

ఏర్పేడు: ‘తిరుత్సవ్‌’ పేరిట ఐఐటీలో ఏటా నిర్వహించే సాంస్కృతిక సంబరాలు ఈ ఏడాది కూడా యువోత్సాహంతో మిన్నంటాయి. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ ప్రాంగణంలో విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో తిరుత్సవ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం విద్యార్థుల బృందం అనిమే ఫీవర్‌, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, రోల్‌.. కెమెరా.. యాక్షన్‌, ఫ్యాషన్‌ షో ప్రదర్శనలు జరిగాయి. సాయంత్రం విద్యార్థుల సదరం బ్యాండ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

ఉర్రూతలూగించిన డీజే ఆర్టిస్ట్‌

డీజే కాశిష్‌ రాథోడ్‌ ప్రదర్శన

రాత్రి డీజే ఆర్టిస్ట్‌ డీజే కాశిష్‌ రాథోడ్‌ ప్రదర్శన ఆద్యంతం వీక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. హుషారైన పాప్‌ గీతాలతో ఆమె చేసిన డీజే నృత్యాలతో ఐఐటీ ప్రాంగణం విద్యార్థుల కేరింతలతో హోరెత్తింది. ఐఐటీ విద్యార్థులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు నృత్యాలు చేస్తూ కేరింతలతో ఈవెంట్‌ను ఆస్వాదించారు. వేదిక ప్రాంగణమంతా విద్యుత్‌ వెలుగుల జిలుగులు, హుషారైన మ్యూజికల్‌ శబ్ధాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

నేటితో ముగియనున్న తిరుత్సవ–2026

ఏర్పేడు వద్ద ఐఐటీ ప్రాంగణంలో జరుగుతున్న తిరు త్సవ–2026 సంబరాల్లో చివరి రోజు ఆదివారం మర్డర్‌ మిస్టరీ, స్వాడ్‌ గేమ్స్‌, బ్‌లైండ్‌ ఫొటోగ్రఫీ, ఎస్కూప్‌ రూమ్‌ వంటి విజ్ఞాన పోటీలు విద్యార్థులకు జరగనున్నాయి. అలాగే రాత్రి సినీ సింగర్‌ హే మచంద్ర, ఇండియన్‌ సింగర్‌ అనుజ్‌రిహాన్‌ మ్యూజికల్‌ నైట్‌ ప్రదర్శనలతో ఉత్సవాలు ముగుస్తాయి.

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌1
1/2

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌2
2/2

మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement