ద్వితీయ అంకం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ద్వితీయ అంకం ప్రారంభం

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

ద్విత

ద్వితీయ అంకం ప్రారంభం

84 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా

సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్ష

తొలిరోజు పరీక్షకు గైర్హాజరైన 450 మంది విద్యార్థులు

నేడు ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్ష

తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 84 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షకు 29,602 మంది హాజరుకావాల్సి ఉండగా, 29,152 మంది హాజరయ్యారు, కాగా 450 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘా నీడలో, అధికారుల ఆకస్మిక తనిఖీల నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు.

నేడు ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్ష

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్ష జరగనుంది. జిల్లాలో 84 పరీక్ష కేంద్రాల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మాస్‌కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రతి పరీక్ష కేంద్రాన్ని సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పాటు సీసీకెమెరాలతో లైవ్‌ స్ట్రీమ్‌ ద్వారా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

పరీక్ష కేంద్రాల వద్ద

తల్లిదండ్రుల సందడి

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులను తీసుకొచ్చిన తల్లిదండ్రులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. విద్యార్థులకు పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలుకువులను చెబుతూ బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పి, ధైర్యం నూరిపోశారు. అనంతరం 3 గంటల పాటు పరీక్ష కేంద్రాల వద్ద ఎండను సైతం లెక్కచేయకుండా పడిగాపులు కాశారు.

మొదలైన ఇంటర్‌

సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు

ద్వితీయ అంకం ప్రారంభం1
1/2

ద్వితీయ అంకం ప్రారంభం

ద్వితీయ అంకం ప్రారంభం2
2/2

ద్వితీయ అంకం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement