శుభ్రంగా ఉంచండి.. కొనుగోలు చేస్తాం
తిరుపతి అర్బన్: ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ, జల్లు, నల్ల వక్కులు లేకుండా ధాన్యం శుభ్రం ఎండబెట్టి ఉంచితే తప్పకుండా వందశాతం ధాన్యం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంట నూర్పిళ్లు చేస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న ధాన్యం ధరల కంటే ప్రైవేటుగా ధరలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అటు వైపు వెళ్లవద్దని సూచించారు. ప్రభుత్వానికి ధాన్యం ఇస్తే జాప్యం లేకుండా నగదును మీ బ్యాంక్ అకౌంట్‌కు జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి పంట ఈ–క్రాప్ తప్పకుండా చేయించి ఉండాలని వెల్లడించారు. అనంతరం మిల్లర్లు ధాన్యాన్ని పరిశీలించి, తప్పకుండా కొనుగోలు చేస్తారన్నారు. అయితే అన్నదాతలు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
శుభ్రంగా ఉంచండి.. కొనుగోలు చేస్తాం


