ఆలయ భూముల్లో రాళ్ల తొలగింపు
రేణిగుంట:గాజులమండ్యం పంచాయతీ నీలిసానిపేటలోని ఆలయ భూముల్లో రాళ్లను తహసీల్దార్ మంగవారం తొలగించారు. మండలంలోని గాజులమండ్యం పంచాయతీ నీలిసానిపేటలో జరుగుతున్న భూ ఆక్రమణలపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘మా గ్రామాన్ని కాపాడండి’ అనే శీర్షికన వచ్చిన కథనంపై రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి, తమ సిబ్బందితో మంగళవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. బసవేశ్వర ఆలయ భూముల్లో అక్రమంగా ప్లాట్ల కోసం వేసిన రాళ్లను తొలగించారు. ప్రభుత్వ, ఆలయ భూములను ఎవరు ఆక్రమించుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా ఆలయ భూమితోపాటు కోనేరు, సోమయ్య కాలువ, నల్లపాళెం కాలువ, ఎస్టీ కాలనీ బాలబడి స్థలం భూములను కూడా సర్వే చేసి అక్రమ కట్టడాలను తొలగించి, గ్రామానికి చెందిన భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆలయ భూముల్లో రాళ్ల తొలగింపు


